Header Banner

శ్రీ మహంకాళి అమ్మవారికి సారె సమర్పించిన మంత్రి! ఎలాంటి ఆటంకం కలగకుండా..

  Sun May 04, 2025 21:30        Politics

రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేడు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. దుగ్గిరాల మండలం కంఠంరాజ కొండూరు గ్రామంలోని శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానం పునఃప్రతిష్ట మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న మంత్రి లోకేశ్ కు ఆలయ అధికారులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ తొలుత అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, సారెను సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనాలు అందించి, జ్ఞాపికను బహూకరించారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా ప్రతిష్టించిన శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయాలను కూడా మంత్రి సందర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు జరిపారు.

 

ఇది కూడా చదవండి: యుద్ధం వస్తే దేశం విడిచి పారిపోయేందుకు పాక్ నేతలు రెడీ.. బీజేపీ నేత వ్యాఖ్యలు!

 

మంత్రి రాక సందర్భంగా పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, దుగ్గిరాల టీడీపీ మండల అధ్యక్షురాలు కేసమనేని అనిత తదితరులు పాల్గొన్నారు. ఆలయ కార్యక్రమాన్ని ముగించుకుని మంగళగిరికి తిరుగు పయనమైన మంత్రి లోకేశ్, మార్గమధ్యంలో కాజ-చినవడ్లపూడి మధ్య ఉన్న బకింగ్‌హోం కాలువను పరిశీలించారు. కాలువలో గుర్రపు డెక్క భారీగా పేరుకుపోయి ఉండటాన్ని ఆయన గమనించారు. త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో, రైతులకు నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు తక్షణమే గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.4 వేలు! ఈ పథకం గురించి తెలుసా, దరఖాస్తు చేస్కోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting